'తలపతి' సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు

Ruthvik
Published on: 12 Feb 2019 3:25 PM IST
తలపతి సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు
X

సంతోష్ శివన్ సౌత్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ లో మెంబర్షిప్ ఉన్న ఏకైక భారత సినిమాటోగ్రాఫర్ ఇతనే. గత 20 ఏళ్లుగా బోలెడు భాషల్లో తన కెమెరా నైపుణ్యాన్ని చాటుతూ వచ్చాడు సంతోష్ శివన్. ఇప్పుడు మళ్లీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చేయబోతున్నారు. ఈ మధ్యనే 'పేట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ రెండు నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆఖరి సారిగా సంతోష్ శివన్ 1991లో విడుదలైన 'తలపతి' సినిమా కోసం రజనీతో కలిసి పని చేశారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తరువాత ఆయన ఈ సినిమాకి పని చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ "తలపతి సినిమా తర్వాత మళ్లీ రజనీ సార్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు.

Ruthvik

Ruthvik

Next Story