Santosh Shoban - Fariya Abdullah: ఏక్ మినీ కథ హీరోతో జాతిరత్నాలు హీరోయిన్

Santosh Shoban - Fariya Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న సంతోష్ శోభన్

admin1
Published on: 9 Dec 2021 12:21 PM IST
Santosh Shoban is Going to do a Film with Faria Abdullah
X

జాతి రత్నాలు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న సంతోష్ శోభన్

Santosh Shoban - Fariya Abdullah: రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరో నాగార్జున సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే మరోవైపు ఫరియ కు మరొక సినిమా ఆఫర్ వచ్చింది.

"ఏక్ మినీ కథ" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అందులో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది ఫరియ.

"ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ నాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కూడా నా పాత్ర యువత కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది" అని చెప్పింది ఫరియ. ఇక ఇద్దరి పాత్రలు చాలా బాగుంటాయని, తన పాత్ర నచ్చే ఈ సినిమాకి సైన్ చేసినట్లుగా తెలిపింది ఈ బ్యూటీ. ఒరిజినాలిటీ ఉండేది దర్శకులతో పని చేయడం అంటే తనకి చాలా ఇష్టమని, అలాగే సంతోష్ శోభన్ ఎంచుకునే స్క్రిప్ట్ పై కూడా తనకి చాలా నమ్మకం ఉందని చెప్పిన ఫరియ ఇప్పటిదాకా తనని కలవలేదని కానీ వారిద్దరి పెయిర్ వెండితెరపై చూడటానికి బాగుంటుంది అని అంటోంది.

admin1

admin1

Next Story