logo

మరొక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంకల్ప్ రెడ్డి

మరొక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంకల్ప్ రెడ్డి

'ఘాజి' అనే సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో అలాంటి అండర్ వాటర్ వార్ సినిమాను చిత్రీకరించిన ఘనత సంకల్ప్ రెడ్డికే దక్కింది. రానా హీరోగా నటించిన 'ఘాజి' సినిమా హిట్ అయ్యి సంకల్ప్ రెడ్డి కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ రెండవ సినిమాతో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. ఈ మధ్యనే 'అంతరిక్షం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంకల్ప్ రెడ్డి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా స్పేస్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. తెలుగు లో ఇలాంటి చిత్రం రావడం ఇది మొదటిసారి అయినప్పటికీ ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాను మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువ దర్శకుడు తన తదుపరి సినిమా కోసం సరికొత్త స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా అంటార్కిటికా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే తెలుగు లో ఇలాంటి క్రియేటివ్ సినిమాలు తీస్తున్న దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మంచి గుర్తింపుని సాధిస్తాడు.

లైవ్ టీవి

Share it
Top