Sanjay Dutt : జైలులో సంజయ్ దత్ సంపాదించిన డబ్బు ఎంతో తెలుసా? ఆయన చేసిన పని ఏంటంటే..

Sanjay Dutt : జైలులో సంజయ్ దత్ సంపాదించిన డబ్బు ఎంతో తెలుసా? ఆయన చేసిన పని ఏంటంటే..
x

Sanjay Dutt : జైలులో సంజయ్ దత్ సంపాదించిన డబ్బు ఎంతో తెలుసా? ఆయన చేసిన పని ఏంటంటే..

Highlights

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతను అనేక సినిమాలలో నటించాడు. దక్షిణాదిలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన వృత్తిపరమైన జీవితం కంటే వ్యక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇటీవల తన జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

Sanjay Dutt : బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతను అనేక సినిమాలలో నటించాడు. దక్షిణాదిలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన వృత్తిపరమైన జీవితం కంటే వ్యక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇటీవల తన జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా జైలులో గడిపిన రోజుల జ్ఞాపకాలను పంచుకున్నాడు. సంజయ్ దత్ తన స్నేహితుడు, నటుడు సునీల్ శెట్టితో కలిసి హాస్యనటుడు కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. సంజయ్ దత్ జైలులో పని చేసేవాడని, దానికి అతనికి డబ్బులు కూడా వచ్చేవని వెల్లడించాడు.

సంజయ్ దత్ జైలులో తన సొంత రేడియో కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. అంతేకాకుండా, నటుడు ఒక నాటక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. దీనితో పాటు, సంజయ్ జైలులో కుర్చీలు, పేపర్ బ్యాగులు తయారు చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించాడు. సంజయ్ మాట్లాడుతూ.. “నేను జైలులో నాటకాలు కూడా చేశాను. నాతో పాటు హత్య చేసిన వారు కూడా పని చేసేవారు. ఖైదీలతో నాటకాలకు కథలు రాయించేవాడిని” అని చెప్పాడు. సంజయ్ దత్ మొత్తం రూ.38 వేలు సంపాదించాడు. అందులో అతను జైలులో తన రోజువారీ అవసరాల కోసం ఖర్చు పెట్టుకున్నాడు. చివరికి అతని దగ్గర కేవలం రూ.450 మాత్రమే మిగిలాయి.

1993 నాటి ముంబై బాంబు పేలుడు కేసులో సంజయ్ దత్ పేరు వినిపించింది. ఆయుధాల చట్టానికి సంబంధించిన కేసులో నటుడు చాలాసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అతను ఐదు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఇవి నటుడి జీవితంలో అత్యంత కష్టమైన రోజులు. సంజయ్ దత్ సినిమాల విషయానికి వస్తే, సంజయ్ బాఘీ 4 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 66 సంవత్సరాల వయస్సులో కూడా నటుడు ఇంకా పెద్ద తెరపై చురుకుగా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories