బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సూపర్ స్టార్ సినిమా

*బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సూపర్ స్టార్ సినిమా

Rama Rao
Updated on: 12 Jun 2022 7:31 PM IST
Samrat Prithviraj Movie Shows Cancelled Due to Empty Theatres
X

బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సూపర్ స్టార్ సినిమా

Samrat Prithviraj Movie: కరోనా కారణంగా దెబ్బతిన్న ఇండస్ట్రీని మళ్ళీ బాగు చేసే ప్రయత్నాలలో బాలీవుడ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు మాత్రం అనుకున్న స్థాయి లో వసూళ్లు చేయలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ఇలా వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చిన తర్వాత కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన "భూల్ బులయ్య 2" విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్ కి ఒక రకంగా ఊరట కలిగించింది కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మళ్ళీ తిరగబడే లాగానే అనిపిస్తున్నాయి.

ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన చారిత్రక చిత్రం "సామ్రాట్ పృథ్వీరాజ్" విడుదలైంది. చంద్రశేఖర్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మించారు. 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 55 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లను నమోదు చేసుకోగలిగింది. ఇక చాలా వరకు థియేటర్లలో అధిక భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో థియేటర్ యాజమాన్యం సైతం చాలావరకు షోలను రద్దు చేసేస్తోంది అని తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో వచ్చిన బాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలబడనుంది.

Rama Rao

Rama Rao

Next Story