అదిరింది షో నుంచి సమీరా అవుట్..అతనితో కలసి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!

అదిరింది షో నుంచి సమీరా అవుట్..అతనితో కలసి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!
x
adirindi show latest promo scenes (screen shots of zee telugu you tube vedio)
Highlights

ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో కు పోటీగా జీ తెలుగులో వస్తున్న అదిరింది షో లో యాంకర్ ను మార్చారు. అదిరింది షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సమీరా షరీఫ్ స్థానంలో ఇద్దరు యాంకర్లు వస్తున్నట్టు తాజా ప్రోమోలో రివీల్ అయింది.

జబర్దస్త్ ఏడేళ్ళుగా టీవీ షో లలో ఓ సంచలనంగా నిలిచిన షో. ఈ షో కు పోటీగా ఎన్నో షో లు వచ్చాయి.. వెళ్ళాయి. కానీ, ఏడేళ్ళుగా జబర్దస్త్ నవ్విస్తూనే ఉంది. అయితే, ఇటీవల జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిన కొందరితో జీ తెలుగు అదిరింది అనే షో ప్రారంభించిన విషయం తెలిసిందే. హంగామాతో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిందని టీఆర్పీ రేటింగ్స్ చెప్పాయి. ఈ నేపధ్యంలో అదిరింది షో ఆగిపోతుందనే వార్తలూ ఇండస్ట్రీలో హల్చల్ చేశాయి. కానీ, అదిరింది నిర్వాహకులు మాత్రం ఈ షో విషయంలో గట్టిపట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఆరంభం నుంచీ పేలవంగా..

ఏడేళ్ళుగా అలరిస్తున్న జబర్దస్త్ షోకు న్యాయనిర్ణేతగా మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరించేవారు. ఆయన జబర్దస్త్ వదిలి బయటకు రావడానికి సిద్ధం అయిపోయారు. ఆయనతో పాటు జబర్దస్త్ నుంచి చాలా మంది టీం లీడర్లు.. యాంకర్ అనసూయ కూడా బయటకు వెళ్లిపోతారని విపరీతంగా ప్రచారం జరిగింది. జీతెలుగు జబర్దస్త్ కు పోటీగా ఒక కార్యక్రమం రూపొందిస్తోందనీ..దానికి జబర్దస్త్ నుంచి చాలా మంది జంప్ అవుతున్నరానీ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపధ్యంలో నాగబాబు జబర్దస్త్ కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అదిరింది పేరుతొ జీ తెలుగు కొత్త కామెడీ షో ప్రారంభించింది. మాటల్లేవ్..మాట్లాడుకోడాల్లేవ్ అంటూ భారీ ప్రచారం తో దూసుకు వచ్చింది అదిరింది షో. అయితే, మొదటి ఎపిసోడ్ నుంచే ఈ షో చాలా పేలవంగా అనిపించింది ప్రేక్షకులకు. సెట్ దగ్గర నుంచి స్కిట్ ల వరకూ మొత్తం జబర్దస్త్ కు నకలు లా కార్యక్రమం కనబడడం తో నాగబాబు అభిమానులూ నిరాశ చెందారు. ఇప్పటికి పది ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకొకపోగా.. మనుగడ కష్టం అనే ప్రచారం జరిగే స్థితికి వచ్చేసింది.

నటిగా టాప్..యాంకర్ గా ఫ్లాప్!

జబర్దస్త్ షో కి అనసూయ..రష్మి ఇద్దరూ ఒక గ్లామర్ అద్దారు. వారి యాంకరింగ్ ప్రతిభ తక్కువ కాదు. వారిద్దరూ ఆధునికత కలగలిపిన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జబర్దస్త్ విజయంలో వీరి పాత్రను తక్కువ చేయలేం. ఇంకా చెప్పాలంటే ఇటువంటి కామెడీ షో లకు యాంకర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. స్కిట్ల మధ్యలో కమెడియన్లు యాన్కర్లపై వేసే పంచ్ లు.. వాటికి వాళ్ళిచ్చే రియాక్షన్లు.. చాలా ముఖ్యమైనవి. ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఇటువంటి వాటికి కనెక్ట్ అయిపోతారు. అయితే, అదిరింది షో కు అటువంటి యాంకర్ కుదరలేదనే చెప్పాలి. టీవీ తెరపై 2006 నుంచీ మంచి నటిగా ప్రముఖ చానెల్స్ అన్నిటిలోనూ ప్రసారం అయిన 'ఆడపిల్ల', 'అభిషేకం', 'భార్యమణి', 'మూడు ముళ్ల బంధం', 'ప్రతిబింబం', 'మంగమ్మ గారి మనవరాలు' వంటి సూపర్ హిట్ సీరియళ్ళలో నటించి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న సమీరా షరీఫ్ అదిరింది షోకు యాంకర్ గా ప్రత్యక్షం అయ్యారు. నటిగా ఎంతో విజయవంతం అయిన ఆమె, యాంకర్ గా మాత్రం మార్కులు సాధించాలేకపోయారని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఆమెను యాంకర్ గా అంగీకరించలేదనే చెప్పాలి. నటిగా చేయడం వేరు..యాంకర్ గా చేయడం వేరు. స్పాంటేనియస్ గా రెస్పాండ్ కావలసిన అవసరం యాంకర్ కు ఉంటుంది. అది సమీరాలో లోపించింది అనేది ప్రేక్షకుల అభిప్రాయం.

దిద్దుబాటు చర్యలు..

అదిరింది షో విషయంలో పట్టుదలగా నిర్వాహకులు వ్యవహరిస్తున్న విషయం స్పష్టం అవుతోంది. లోపాలను సవరించడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. గత రెండు ఎపిసోడ్ ల లోనూ స్కిట్ ల లో నాణ్యత పెరిగింది. ఇక మరోవైపు యాంకర్ సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జీ తెలుగు నడుం బిగిన్చినట్టు కనిపిస్తోంది. తాజాగా విడుదల అయిన అదిరింది ప్రోమో లో ఈ విషయం స్పష్టం అయింది. న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న నవదీప్ కొత్త యాంకర్ వస్తున్నాడు అని ప్రకటించగానే.. రవి ప్రత్యక్షం అయ్యారు. అయన వచ్చీ రావడం తోనే టీం లీడర్ సద్దాం ''ఈరోజు హారోస్కోప్ చూసుకోలేదు నేను..ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు'' అంటూ మొహం మాడ్చాడు. దానికి నాగబాబు అందరూ అంత బాధ పడకండి మీకోసం ఆటం బాంబులాంటి యాంకర్ ను పిలిపిద్దాం అంటూ చెప్పారురు. అంతే, బుట్టబొమ్మ పాటతో బిగ్ బాస్ ఫేం బ్యూటీ భాను శ్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రోమోలో రవి..భాను శ్రీ ఇద్దరూ యాంకర్లుగా కనిపిస్తున్నారు. భాను శ్రీ గ్లామరస్ గా కనిపించారు.

మొత్తమ్మీద అదిరింది షో కు కొత్త యాంకర్లు కుదిరినట్టే కనిపిస్తోంది. చూడాలి యాంకర్లు మారిన తర్వాతైనా ఈ షో టీఆర్పీల రాత మారుతుందేమో! రేపు (ఆదివారం) ప్రసారం కాబుతున్న ఈ షో ప్రోమో మీద మీరూ ఓ లుక్కేయండి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories