సమంత వేలికి స్పెష‌ల్ రింగ్.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్..!

సమంత వేలికి స్పెష‌ల్ రింగ్.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్..!
x

సమంత వేలికి స్పెష‌ల్ రింగ్.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్..!

Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తూ ఈ గాసిప్స్‌కు మరింత బలం ఇస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తూ ఈ గాసిప్స్‌కు మరింత బలం ఇస్తున్నారు. లండన్ వీధుల్లో కలిసి సునాయాసంగా తిరగడం, ఇటీవల ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఓకే కారులో బయల్దేరిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా సమంత తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమె చేతికి కొత్తగా ఓ స్పెష‌ల్ రింగ్ కనిపించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ఆమె చేతిలో ఈ రింగ్ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ రింగ్‌తో ఫోజులిచ్చిన సమంతను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ేనా?", "రాజ్ ఇచ్చిందా?", "కొత్త బంధానికి నాంది అయితే?" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ గాసిప్స్‌పై ఇప్పటివరకు సమంత కానీ, రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. అయితే రాజ్ భార్య మాత్రం సోషల్ మీడియాలో ఏవో సంకేతాత్మక పోస్టులు షేర్ చేస్తుండటం గమనార్హం.

ఇక కెరీర్ విషయానికొస్తే.. సమంత ఇటీవలే ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారింది. అలాగే ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తున్న సమంత, అందులో ఓ కీలక పాత్రలోనూ కనిపించనుంది.

ఓ రింగ్ ఫోటోతో నెట్టింట సామ్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది!

Show Full Article
Print Article
Next Story
More Stories