చైతూకి సామ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు!

Samantha Wishes To Naga Chaitanya : టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట నేటి( అక్టోబ‌ర్ 6)తో వివాహ బంధానికి మూడేళ్ళు పూర్తి అయింది.

Krishna
Published on: 6 Oct 2020 5:15 PM IST
చైతూకి సామ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు!
X

Samantha, Naga Chaitanya Marriage

Samantha Wishes To Naga Chaitanya : టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు.. సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కిన ఈ జంట నేటి( అక్టోబ‌ర్ 6)తో వివాహ బంధానికి మూడేళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా సమంత తన భర్తకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని. మనం ఏ ద్వారాల దగ్గరికి చేరుకున్నా.. కలిసే వాటిని తెరుద్దాం (కష్టసుఖాల్ని ఉద్దేశిస్తూ). నా శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు' అని సమంత పేర్కొంది.. అలాగే సినీ నటులు రానా, ఉపాసన, వెన్నెల కిశోర్‌, ప్రియమణి, ప్రగ్యా జైశ్వాల్‌, మంచు లక్ష్మి, కోన నీరజ, రాశీ ఖన్నా, కృతి కర్బందా, చిన్మయి, విమల రామణ్‌ మొదలగు వారు సామ్,చైతూలకి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు అభిమానులు కూడా వీరికి విషెస్ అందిస్తున్నారు.

ఎ మాయ చేసావే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు నాగచైతన్య, సమంత.. ఈ సినిమాతో బెస్ట్ జోడి అనిపించుకుంది ఈ జంట.. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరు ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. ఇక కెరీర్ టాప్ లో ఉన్న సమయంలో ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి అక్టోబర్ 06 2017లో ఒక్కటయ్యారు.. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ ఏడాది జాను సినిమాతో మెప్పించింది సమంత. అటు నాగచైతన్య వరుస సక్సెస్ లతో, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టొరీ అనే సినిమాని చేస్తున్నాడు నాగచైతన్య..


Krishna

Krishna

Next Story