Actress Samantha : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సమంత!

Actress Samantha : సినీ నటి అక్కినేని సమంత మరో రంగంలోకి ఎంట్రి ఇస్తుంది. 'సాకీ వరల్డ్' పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది

Krishna
Updated on: 5 Sept 2020 1:52 PM IST
Actress Samantha : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సమంత!
X

Actress Samantha

Actress Samantha : సినీ నటి అక్కినేని సమంత మరో రంగంలోకి ఎంట్రి ఇస్తుంది. 'సాకీ వరల్డ్' పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది సమంత.. దీనికి సంబంధించిన కొత్త ఔట్ లేట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. సాకీ వరల్డ్ లో ధరలు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. మీరందరూ దీన్నీ ఇష్టపడుతారు" అని సామ్ ట్వీట్ చేసింది.

కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత సినిమా రంగం వైపు అడుగులు వేసింది. 2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటి సమంత.. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదిగింది. మొదటి సినిమాతోనే ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తరవాత ఎన్టీఆర్ సరసన బృందావనం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో నటించిన మళ్ళీ వెనుదిరిగి చూసుకుంది లేదు.

ఇక తన మొదటి చిత్ర కథానాయకుడు అయిన అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్ళాడింది సమంత.. వీరికి 2017లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. సాధారణంగా అయితే సినిమాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో హీరోయిన్స్ పెళ్లి వైపు అడుగుపెడతారు కానీ సమంత మాత్రం స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది.

Krishna

Krishna

Next Story