Samantha: తన ఆశలన్నీ ఆవిరైపోయాయి అంటున్న సమంత

Samantha: విడాకుల తర్వాత మొదటిసారి నోరు విప్పిన సమంత

admin1
Updated on: 7 Dec 2021 1:30 PM IST
Samantha Talks for the First Time After Her Divorce
X

విడాకుల తర్వాత మొదటిసారి నోరు విప్పిన సమంత (ఫైల్-ఫోటో)

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల సమంత మరియు నాగ చైతన్య విడాకుల విషయం ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇకపై తాము భార్యాభర్తలుగా కలిసి ఉండలేము అని సామ్ మరియు చై ప్రకటించటం అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. అప్పటిదాకా విడాకుల విషయమై మౌనం వహించిన సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎట్టకేలకు మౌనం వీడిన సామ్ తన ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి అని కలత చెందారు.

"2021 లో నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న పరిస్థితుల తరువాత నాకు ఇంకేం ఎక్స్పెక్టేషన్లు లేవు. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి" అని అన్నారు సమంత. ఇప్పటిదాకా పైకి స్ట్రాంగ్ గానే కనిపించినప్పటికీ సమంత విడాకుల విషయంలో బాగా డిస్టర్బ్ అయ్యారని ఈ మాటలతో అర్థమవుతోంది అని అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇక కెరీర్ పైన దృష్టి పెట్టిన సమంత వరసగా సినిమాలు ఒకే చేస్తోంది. బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంది ఈ భామ.

admin1

admin1

Next Story