అన్ హ్యాపీ మారేజ్ కి కారణం ఏంటో చెప్పిన సమంత

*అన్ హ్యాపీ మారేజ్ కి కారణం ఏంటో చెప్పిన సమంత

Rama Rao
Updated on: 20 July 2022 1:10 PM IST
Samantha Said What is the Reason for Unhappy Marriage
X

అన్ హ్యాపీ మారేజ్ కి కారణం ఏంటో చెప్పిన సమంత

Samanth: బాలీవుడ్ లో పాపులర్ టాక్ షో అయిన "కాఫీ విత్ కరణ్" ఇప్పటికే ఆరు సీజన్ లు పూర్తిచేసుకుని ప్రస్తుతం ఏడవ సీజన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సీజన్ మూడవ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరియు టాలీవుడ్ స్టార్ సమంత గెస్ట్లుగా విచ్చేయనున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకొని మరి షో కీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఎప్పటిలాగానే కరణ్ జోహార్ తన ప్రశ్నలతో సమంత పై బాణాలు విసిరారు. సమంత వాటికి చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది.చాలావరకు అన్ హ్యాపీ మ్యారేజ్ కి కారణం మీరే అంటూ కరణ్ జోహార్ గురించి చెప్పటం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక తన బ్యాచిలరెట్ పార్టీలో ఈ ఇద్దరు హీరోలు డాన్స్ చేయాలి అని అడగగా సమంత వెంటనే రన్వీర్ సింగ్ మరియు రన్వీర్ సింగ్ అని చెప్పింది.

ఇక ఆ ప్రోమో చూస్తూ ఉంటే అక్షయ్ కుమార్ మరియు సమంత బాగానే రచ్చ చేసినట్లు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఈ గురువారం హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ షోలో సమంత నాగచైతన్యతో విడిపోవడానికి గల కారణం చెప్పింది అని కొందరు చెబుతున్నారు. దానిలోని నిజా నిజాలు తెలియాలంటే ఎపిసోడ్ విడుదలయ్యేదాకా ఎదురు చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story