Samantha: బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్న సమంత

Samantha: నయనతార స్థానంలో షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయబోతున్న సమంత

admin1
Updated on: 28 Oct 2021 5:50 PM IST
Samantha Replaces Nayanthara In Shah Rukh Khan-Atlees Film
X

షారుఖ్ ఖాన్ సినిమాలో నయనతార స్థానంలో నటించనున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు కెరీర్ లో బాగానే దృష్టి పెడుతోంది. వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది సమంత. ఈ మధ్యనే చార్ధాం వెళ్ళి వచ్చిన సమంత ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ కోసం ఫారిన్ కూడా వెళ్లబోతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేసిన తెరి, మెర్శల్ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆమెకి అట్లీ దర్శకత్వంలో ఇంకొక సినిమాలో నటించే అవకాశం దొరికింది. ఇందులో హీరో మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న సినిమాలో ముందుగా నయనతార ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ తో త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది. దీనివల్ల తన పెళ్లి సమయంలో డేట్స్ ఇవ్వాల్సి వస్తుందేమోనని నయనతార ఈ సినిమా నుంచి స్వయంగా తప్పుకుంది. దీంతో ఈ అవకాశం ఇప్పుడు సమంతకి దొరికింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకు రానుంది. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో తన పేరు మారుమ్రోగించిన సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది.

admin1

admin1

Next Story