Mumbai: ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన సమంత.. ధర వింటే షాకే..!

Mumbai: ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన సమంత.. ధర వింటే షాకే..!

Dhatripriya
Updated on: 9 Feb 2023 11:45 AM IST
Samantha Bought A House With 15 Crores In Mumbai
X

ముంబైలో 15 కోట్లు పెట్టి ఇల్లు కొన్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పెళ్లయిన తర్వాత నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లోనే ఒక లగ్జూరియస్ అపార్ట్‌మెంట్ లో కలిసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తర్వాత కూడా సమంత అదే ఇంట్లో ఉంటుంది. ఆ ఇల్లు కూడా ఇప్పుడు పూర్తిగా సమంత పేరు మీదే ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు ముంబైలో ఒక పెద్ద త్రీ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లగ్జూరియస్ అపార్ట్‌మెంట్ కోసం సమంత ఏకంగా 15 కోట్లు ఖర్చుపెట్టిందని సమాచారం.

ఈ మధ్యనే రష్మిక మందన్న కూడా ముంబైలో ఒక ఇల్లు కొనుక్కొని బాలీవుడ్ సినిమాలో చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ముంబైలోని తన అపార్ట్‌మెంట్ నుంచి కొన్ని అదిరిపోయే వ్యూలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది సమంత. ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తన ఇంటి నుంచి సన్ సెట్ వ్యూని ఫోటో తీసి షేర్ చేసింది. ఇక తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా సమంత కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

ప్రస్తుతం వరుణ్ సరసన "సిటాడెల్" వెబ్ సిరీస్లో నటిస్తున్న సమంత తెలుగులో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన "శాకుంతలం" ఫిబ్రవరి 17 న విడుదల కావాలి కానీ సినిమా వాయిదా పడింది. ఇక సమంత విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో "ఖుషీ" సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story