సమంత బాలీవుడ్ డెబ్యూ ఇప్పట్లో లేనట్టేనా?

* సమంత బాలీవుడ్ డెబ్యూ సినిమా ఏమైంది?

Rama Rao
Published on: 18 May 2022 1:17 PM IST
Samantha And Taapsee Pannu Bollywood Movie | Telugu Movie News
X

సమంత బాలీవుడ్ డెబ్యూ ఇప్పట్లో లేనట్టేనా?

Samantha Bollywood Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ తాప్సీ మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. సమంత బాలీవుడ్ డెబ్యూ సినిమా ఎందుకు ముందుకు కదలట్లేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు తాప్సీ పన్ను తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న రెండు సినిమాలు ప్రకటించారు కానీ అందులో ఒక్క దాంట్లో కూడా సమంత హీరోయిన్ గా నటించడం లేదు.

ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా తనకి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ లలో ఒక్క సినిమా కథ కూడా తనకి నచ్చకపోవడంతో బాలీవుడ్ డెబ్యూ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు హిందీ లో ఆర్ట్ ఫిల్మ్ లు కాకుండా హీరోల సరసన కమర్షియల్ సినిమా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.

ముందుగా బాలీవుడ్ లో తన మార్కెట్ ని పెంచుకావాలని ప్లాన్ చేస్తున్నారు సమంత. తెలుగులో మాత్రం చాలా వరకు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న సమంత బాలీవుడ్లో కమర్షియల్ సినిమాలలో నటించడానికి రెడీ అనటం అభిమానులను షాక్కు గురి చేసింది. మరో వైపు సమంత తెలుగులో శాకుంతలం, యశోద మరియు ఖుషి సినిమాలతో బిజీగా ఉంది.

Rama Rao

Rama Rao

Next Story