'96' తెలుగు రీమేక్ లో హీరో హీరోయిన్లు ఫిక్స్

96 తెలుగు రీమేక్ లో హీరో హీరోయిన్లు ఫిక్స్
x
Highlights

విజయ్ సేతుపతి, త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన '96' సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు దగ్గర ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఉన్నాయి.

విజయ్ సేతుపతి, త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన '96' సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు దగ్గర ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఉన్నాయి. గత కొంతకాలంగా రీమేక్ సినిమా కోసం హీరో హీరోయిన్లను వెతికే పనిలో పడ్డాడు దిల్ రాజు. ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు వచ్చాయి కానీ అవి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నిజానికి మొదట్లో ఈ సినిమా కథతో సమంత వద్దకు వెళ్ళినప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిది అని సమంత అంది కానీ ఇప్పుడు దిల్ రాజు ఆమెను హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించాడని తెలుస్తోంది. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ఒక క్లాసిక్ ప్రేమ కథ గా సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ అలరించగలదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories