Bollywood News: కత్రినా కైఫ్ పెళ్ళిలో సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్

Bollywood News: కత్రినా కైఫ్ పెళ్లి లో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ

admin1
Published on: 8 Dec 2021 11:57 AM IST
Salman Khans bodyguard Sheras security team will be guarding Vicky Kaushal and Katrina Kaifs wedding in Rajasthan.
X

 కత్రినా కైఫ్ పెళ్లి లో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ (ఫైల్-ఫోటో)

Bollywood News: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో వీరి పెళ్లి డిసెంబర్ 9న డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కత్రినాకైఫ్ సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత చాలా చాలా కాలం రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపిన కత్రినాకైఫ్ తాజాగా ఇప్పుడు విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అవబోతోంది. అయితే వీరిద్దరి పెళ్లికి చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలకు వీరి పెళ్లి ఇన్విటేషన్ అందిందట.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ జంట సల్మాన్ ఖాన్ నీ మాత్రం పెళ్లికి పిలవలేదని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సల్మాన్ ఖాన్ వచ్చినా రాకపోయినా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షెరా మాత్రం రానున్నారు. అసలు విషయం ఏమిటంటే టైగర్ సెక్యూరిటీ అని సొంతంగా ఒక సెక్యూరిటీ కంపెనీ స్థాపించారు షేరా.

ఇప్పుడు విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ పెళ్ళికి సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు. ఈ రకంగా సల్మాన్ ఖాన్ పెళ్లి కి వెళ్లకపోయినా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ టీం మాత్రం అక్కడ ఉండబోతుంది. వచ్చినవారికి సెక్యూరిటీ అందించనుంది.

admin1

admin1

Next Story