Chiranjeevi - Salman Khan: చిరంజీవి సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్

Chiranjeevi - Salman Khan: మెగాస్టార్ చిరంజీవి మరియు కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్నేహం ఇప్పటిది కాదు.

admin1
Updated on: 10 Aug 2021 5:09 PM IST
Salman Khan To Act In Megastar Chiranjeevi Film?
X

Chiranjeevi - Salman Khan: చిరంజీవి సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్

Chiranjeevi - Salman Khan: మెగాస్టార్ చిరంజీవి మరియు కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్నేహం ఇప్పటిది కాదు. మెగా ఫ్యామిలీ కి దగ్గరగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

హిందీలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో తెలుగు లో సత్యదేవ్ కనిపించనున్నారు. తాజాగా ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ "బజరంగీ భాయిజాన్" నటుడు మాత్రం ఈ సినిమా గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ ఓకే అయితే ఇది మెగాస్టార్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కాబోతోంది. ఎల్ వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

admin1

admin1

Next Story