Salman khan Security: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు 'వై ప్లస్' కేటగిరి భద్రత

* సల్మాన్‌కు తాజాగా పెంచిన భధ్రతా కేటగిరి కింద నలుగురు సెక్యూరిటీ సిబ్బంది అన్నివేళలా ఆయన వెన్నంటే ఉంటారు

R Tripura Malini
Published on: 2 Nov 2022 8:25 AM IST
Maharashtra Government Has Increased Security For Salman Khan
X

Salman khan Security: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు ప్రాణహాని.. భద్రత పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం

Salman Khan: బాలీవుడ్ స్టార్,..కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖల కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్‌కు తాజాగా పెంచిన భధ్రతా కేటగిరి కింద నలుగురు సెక్యూరిటీ సిబ్బంది అన్నివేళలా ఆయన వెన్నంటే ఉంటారు.

గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు సల్మాన్‌ఖాన్‌ను ముంబైలోనే మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశారు. రెండు సార్లు ఈ ప్రయత్నాలు జరిగినట్టు చెబుతున్నారు. 2017లో బాంద్రా హౌస్ వెలుపల ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ, రెండోసారి 2018లో ఆయన పాన్వెల్ ఫామ్‌హౌస్‌ వద్ద మట్టు బెట్టేందుకు ప్లాన్ జరిగింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story