బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్‌కు బాలీవుడ్ ఆఫర్.. ఆ ఒక్క సినిమాతో..

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

admin1
Published on: 25 Jan 2022 4:25 PM IST
Salman Khan and Pragya Jaiswal in Antim
X

బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్‌కు బాలీవుడ్ ఆఫర్.. ఆ ఒక్క సినిమాతో..

Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్న ప్రగ్యా జైస్వాల్ తన నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంది. నిజానికి అఖండ సినిమాలోప్రగ్యా జైస్వాల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఆమె పాత్ర నిడివి కూడా కొంచెం తక్కువ అనే చెప్పాలి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె కెరీర్ కు ఈ సినిమా బాగా ప్లస్సయింది. సీనియర్ హీరోలకు హీరోయిన్ కొరత ఎక్కువగా ఉంటుంది అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ గా మారింది ప్రగ్యా .

బాలకృష్ణ కూడా మళ్లీ తన సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. దీంతో ఈ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కి బంపర్ ఆఫర్ తగిలింది. హిందీలో ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న "అంతిమ: ది ఫైనల్ ట్రూత్" అనే సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన ప్రగ్యా కనిపించనుంది. దీంతో ప్రగ్యా పేరు బాలీవుడ్లో కూడా మారుమ్రోగుతోంది. సల్మాన్ ఖాన్ తో స్టెప్పులు అంటే కంగారు పడ్డాను అని కానీ ఆ ఒక్క సినిమాతో తన జన్మ ధన్యమైందని చెప్పుకొచ్చింది ఈ భామ.

admin1

admin1

Next Story