Salman Khan: ప్రగ్యా జైస్వాల్ కి షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

Salman Khan: బాలకృష్ణ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

admin1
Updated on: 25 Nov 2021 2:30 PM IST
Salman Gives a Shock to Pragya Jaiswal
X

ప్రగ్య జైస్వాల్ (ఫైల్ ఇమేజ్)

Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన నటించటం ఏ హీరోయిన్ కైనా ఒక అదృష్టమని చెప్పాలి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కానీ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం టాలీవుడ్ బ్యూటీ పోయింది ప్రగ్యా జైస్వాల్ కి మాత్రం అందినట్టే అంది చేజారి పోయింది. సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త ఆయుష్ శర్మ ప్రస్తుతం హిందీలో "యాంట్రిమ్" అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన ప్రగ్య జైస్వాల్ నటించడానికి సైన్ చేసింది. సల్మాన్ ఖాన్ తో పాటు కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాట షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఈ సినిమాలో తన పాత్ర నిడివి కథ ఫ్లో కి అడ్డంకిగా ఉందని భావించిన సల్మాన్ ఖాన్ తన సన్నివేశాలని కట్ చేశారట. దీంతో ప్రగ్య కి పెద్ద షాక్ తగిలింది. ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న "అఖండ" సినిమా పైనే పెట్టుకుంది ఈ భామ.

admin1

admin1

Next Story