Sairam Shankar: సాయిరాం శంకర్ హీరోగా 'బంపర్ ఆఫర్ 2'

Sairam Shankar: హీరో సాయిరాం శంకర్ 'బంపర్ ఆఫర్' చిత్రాకి సీక్వెల్ లో 'బంపర్ ఆఫర్ 2' లోనటించనున్నారు.

Kranthi
Updated on: 6 March 2021 11:01 AM IST
Sairam Shankar‘Bumper Offer 2’ with Sairam Shankar as the Hero
X

ఇమేజ్ ఫైల్


Sairam Shankar: సాయిరాం శంకర్ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న 'బంపర్ ఆఫర్' చిత్రాకి సీక్వెల్ లో 'బంపర్ ఆఫర్ 2' లోనటించనున్నారు. ఈ మేరకు సురేష్ విజయ ప్రొడక్షన్స్ మరియు సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా 'బంపర్ ఆఫర్ 2' చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ కూడా.

రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. 'బంపర్ ఆఫర్' చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాత సురేష్ యల్లంరాజు తెలిపారు .

Kranthi

Kranthi

Next Story