సాయిపల్లవి క్లాసికల్ డ్యాన్సర్ గా..

సాయిపల్లవి క్లాసికల్ డ్యాన్సర్ గా..
x
Highlights

ఫిదా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి మళ్లీ ఓ సినిమా చేయనుంది. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి కల్సికల్ డ్యాన్సర్ గా కనిపించనుందని తెలుస్తోంది.

హీరోయిన్ సాయిపల్లవి పేరు తలచుకోగానే ఆమె డాన్స్ వెంటనే గుర్తువస్తుంది. డ్యాన్సర్ గా ఎంత పేరు సంపాదించిందో అంతకు మించిన పేరు హీరోయిన్ గానూ సంపాదించింది. ఇప్పటి వరకూ పలు సినిమాల్లో నటించిన సాయిపల్లవి పూర్తి డ్యాన్సర్ గా మాత్రం ఏ సినిమాలోనూ కనిపించలేదు. ప్రేక్షకులు కూడా సాయిపల్లవి పూర్తిస్థాయి డ్యాన్సర్ గా నటిస్తే బావుండునని కోరుకుంటారు.

ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. సహజ సిద్ధమైన కథలతో.. ఆధునిక టేకింగ్ తో ఇటు యూత్ ని అటు ఫ్యామిలీస్ ని తన సినిమా వైపు తిప్పుకునే దమ్మున్న దర్శకుడు శేఖర్ కమ్ముల . ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతోనే సాయిపల్లవి రేంజ్ మారిపోయింది. ఇప్పడు ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు. నాగచైతన్య హీరోగా తాజాగా శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె పూర్తిస్థాయి డ్యాన్సర్ గా కనిపించాబోతోందట. ఈ సినిమా కథ మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. చైతూకి కూడా ఈ సినిమా టర్నింగ్ వచ్చే క్యారెక్టర్ అని అంటున్నారు. అయితే, సాయిపల్లవి ఈ సినిమాలో క్లాసికల్ డ్యాన్సర్ గా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25వ తేదీ నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేసి, జనవరిలో సినిమా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories