పెళ్లి గురించి షాకింగ్ జవాబిచ్చిన సాయి పల్లవి

పెళ్లి గురించి షాకింగ్ జవాబిచ్చిన సాయి పల్లవి
x
Highlights

'ప్రేమమ్' సినిమాతో మలయాళంలో పాపులరైన సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ...

'ప్రేమమ్' సినిమాతో మలయాళంలో పాపులరైన సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని తో నటించిన 'ఎంసీఏ' సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మధ్యనే విడుదలైన 'పడి పడి లేచే మనసు' సినిమా తో డిజాస్టర్ ను చవి చూసిన సాయి పల్లవి ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న 'ఎన్జీకే' మరియు ఫాహద్ ఫాసిల్ తో మరొక సినిమాతో బిజీగా ఉంది.

ఇక సినిమాలను పక్కన పెడితే తన కుటుంబంతో ఎంతో ప్రేమగా ఉండే సాయి పల్లవి తనకు పెళ్లి చేసుకోవాలని లేదు అని ఖరాఖండిగా గా చెప్పేస్తోంది. ఈ మధ్యనే పెళ్లి గురించి అడుగగా "నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నాకు మా అమ్మానాన్నలను వదిలి వెళ్లాలని లేదు. నాకు వాళ్లతోనే ఉండాలని వాళ్ళని బాగా చూసుకోవాలని ఉంది. కానీ పెళ్ళయితే అది జరగదు. నా బాధ్యత నేను నిలబెట్టుకోలేను. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను" అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సాయిపల్లవి.

Show Full Article
Print Article
Next Story
More Stories