మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు

మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు
x
Highlights

గత కొంత కాలంగా ఒక్క హిట్టు లేని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకోవచ్చు. కెరీర్ మొత్తంలోనూ ఒకటి రెండు బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ తేజ్...

గత కొంత కాలంగా ఒక్క హిట్టు లేని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకోవచ్చు. కెరీర్ మొత్తంలోనూ ఒకటి రెండు బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ తేజ్ బ్లాక్బస్టర్ అందుకుని చాలా కాలమే అయింది. ఇక 'సుప్రీమ్' సినిమా తరువాత ఆరు సినిమాల్లో తేజ్ కనిపించాడు. అయితే ఆ ఆరు సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో మార్కెట్ బాగా పడిపోయింది. ఇక 'తేజ్ ఐ లవ్ యు' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తేజ్ తన తదుపరి చిత్రం అయిన 'చిత్రాలహరి' పై దృష్టి పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెగా మేనల్లుడు మరొక సినిమా లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ మధ్యనే 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాతో డిజాస్టర్ ని చవిచూసిన మారుతి ఎలాగైనా తేజ్ కి ఒక బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాని యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories