మెగా కుటుంబంలో మళ్ళీ పెళ్లి సందడి?

Sai Dharam Tej
x

మెగా ఫామిలీ ఫైల్ ఫోటో 

Highlights

మెగా కుటుంబంలో మళ్ళీ పెండ్లి సందడి నెలకొననుంది.

మెగా కుటుంబంలో మళ్ళీ పెండ్లి సందడి నెలకొననుంది.మెగా ఫ్యామిలీలో పెళ్లి కావాల్సిన హీరోలు క్యూలో ఉన్నారు. ఇటీవలే మెగా బ్రదర్ నాగాబాబు గారాల పట్టి, సినీనటి నిహారిక వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే. నిహారిక పెళ్లి తర్వాత కుటుంబంలోని వరుణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లకు వివాహం చేయాలని కుంటుంబ సభ్యలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యలో అయితే త్వరలోనే మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిహారిక వివాహం తరువాత తన పెళ్లిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మెగా స్టార్ చిరంజీవి తన మేనల్లుడి పెళ్లి బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి తన చెల్లితో కలిసి అమ్మాయిని కూడా సెలక్ట్ చేశారని తెలుస్తోంది. సాయి కోసం వెతికిన వధువు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని, మెగా కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఆ అమ్మాయి సాయితేజ్ కూడా తెలుసని తెలుస్తోంది. పెళ్లికి సాయి తేజ్ కూడా అంగీకరిచారని సమాచారం. మే నెల వరకు ముహుర్తలు లేకపోవడంతో.. ముందు రిసెప్షన్ చేసుకొని మేలో లేదా జూన్ మాసంలో పెళ్లి చేయాని కుటుంబ సభ్యలు భావిస్తున్నారు. మొత్తానికి మరోసారి మెగా కుటుంబంలో వివాహ వేడుక జరగనుంది. నిహారిక పెళ్ళి తర్వాత మెగా కుటుంబం మొత్తం మరోసారి కలవనుండటంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు. సాయి తేజ్ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం సాయితేజ్ రిపబ్లిక్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. దేవకట్టా దర్శకత్వంలో కాంబోలో ఓ పొలిటికల్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories