Sampath Nandi New Movie: సంపత్ నంది డైరెక్టర్ తో చేతులు కలపనున్న మెగాహీరో

సంపత్ నంది డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్

admin1
Published on: 20 Dec 2021 6:47 PM IST
Sai Dharam Tej Next Movie Director Sampath Nandi
X

 సంపత్ నంది డైరెక్టర్ తో చేతులు కలపనున్న మెగాహీరో

Sai Dharam Tej New Movie: మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన "రిపబ్లిక్" సినిమా ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఆక్సిడెంట్ తరువాత చాలా రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న సాయి ధరంతేజ్ తన తదుపరి సినిమా ఎవరితో చేయనున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా కి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"ఏమైంది ఈవేళ" సినిమాతో డైరెక్టర్ గా మారిన సంపత్ నంది "రచ్చ", "బెంగాల్ టైగర్", "గౌతమ్ నంద" వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ హీరోగా "సిటీ మార్" సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సంపత్ నంది ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఒక ప్రముఖ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరి ఈ సినిమాతో మెగా హీరో మంచి హిట్ అందుకున్నాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

admin1

admin1

Next Story