logo
సినిమా

డబ్బింగ్ పనులతో బిజీ అయిన 'చిత్రాలహరి' టీం

డబ్బింగ్ పనులతో బిజీ అయిన చిత్రాలహరి టీం
X
Highlights

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఎటూ కాకుండా పోయింది. 'సుప్రీమ్' సినిమా తర్వాత ఒక మంచి...

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఎటూ కాకుండా పోయింది. 'సుప్రీమ్' సినిమా తర్వాత ఒక మంచి హిట్టు కూడా అందుకోలేకపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ మధ్యనే విడుదలైన 'తేజ్ ఐ లవ్ యు' సినిమా కూడా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసింది. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'చిత్రలహరి' పైనే పెట్టుకున్నాడు. కనీసం ఈ సినిమాతో అయినా తేజు తేజు ఒక మంచి హిట్ అందుకుంటే బాగుండు అని మెగా అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ కూడా ముఖ్య పాత్ర పోషించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం డబ్బింగ్ పనులను మొదలు పెట్టింది. ప్రస్తుతం సునీల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ డ్రామాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story