పవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?

Pawan Kalyan With Sai Dharam Tej: ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్...

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 8:30 PM IST
Sai Dharam Tej Bike Accident Scene in Pawan Movie
X

పవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?

Pawan Kalyan With Sai Dharam Tej: ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మరొక సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మెగా హీరో సాయితేజ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుండడం విశేషం.

ఇద్దరు మెగా హీరోలను వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చనిపోయిన ఒక వ్యక్తికి దేవుడు మరొక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ. అయితే ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ కి నిజంగానే బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. చాలాకాలం హాస్పిటల్లో ఉండి ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యారు తేజ్.

అయితే తాజాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్రకి కూడా బైక్ యాక్సిడెంట్ అవుతుందట. నిజానికి ఒరిజినల్ లో కారు ప్రమాదంలో ఆ పాత్ర చనిపోతుంది. కానీ తెలుగులో మాత్రం బైక్ మీద వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని మార్పులు చేశారట. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story