అట్టహాసంగా ప్రారంభమైన సాహో ప్రీ రిలీజ్ వేడుకలు

అట్టహాసంగా ప్రారంభమైన సాహో ప్రీ రిలీజ్ వేడుకలు
x
Highlights

ప్రపంచ స్థాయిలో నిర్మితమైన టాలీవుడ్ సినిమా సాహో ప్రీ రిలీజ్ వేడుక అద్భుతంగా ప్రారంభమైంది

అభిమానులు ఎప్పుడా..ఎప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా సాహో ప్రీరిలీజ్ వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా మొదలయ్యాయి. వేలాది మంది అభిమానులు సాహూ జయహో అనే నినాదాలతో ఆ ప్రాంతం మారు మోగుతోంది. సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. వరుసగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. డాన్సర్లు తమ డాన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హేమంత్ అభిమానులతో మాటా మంతీ కలుపుతున్నారు. మరి కొద్దీ సేపట్లో అతిథుల తో మరింత సంబరం మొదలు కాబోతోంది. సహా మేకింగ్ టీజర్ ఈ సందర్భంగా ప్రదర్శించారు.

అద్భుతమైన సెట్టింగ్.. రంగులతో నిండిన డయాస్ ఆకట్టుకుంటోంది. అభిమానుల కోలాహలానికి అంతే లేకుండా పోతోంది. సాహోసినిమాలో వాడిన కారులు, ఆయుధాలు, బైక్ లు మీటింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. వాటిని చూసిన అభిమానులు మురిసిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories