భారీగా సాహో ప్రీరిలీజ్ వేడుక

భారీగా సాహో ప్రీరిలీజ్ వేడుక
x
Highlights

సాహో సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఒక రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ భాషలోనూ జరగనంత అట్టహాసంగా రామోజీ ఫిలిం సిటీ లో వేడుక జరుగుతోంది. భారీ...

సాహో సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఒక రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ భాషలోనూ జరగనంత అట్టహాసంగా రామోజీ ఫిలిం సిటీ లో వేడుక జరుగుతోంది. భారీ సెట్టింగ్.. అంతకంటే భారీ ఏర్పాట్లు.. అన్నిటినీ మించి లక్షలాది అభిమానులు.. ఒక రేంజ్ లో సినిమా వేడుక జరుగుతోంది. భారత దేశ సినిమా చరిత్రలోనే ఇంతవరకూ ఏ సినిమాకీ లేనంత భారీ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో ఈ సాహో నిర్మించారు. భారీ స్థాయిలో రంగు రంగుల్లో వేడుక హంగామాగా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

డార్లింగ్ అభిమానులు అంటే మాటలు కాదు. లక్షకు మించి లెక్కకు అందనంత మంది ఈ ఈవెంట్ కి తరలి వచ్చారు. దీంతో పోలీసులకు వారిని అదుపు చేయడం తలనొప్పిగా మారింది. ఇక అభిమానులు ఉత్సాహం శృతి మించే ప్రమాదం ఏర్పడింది. ఈ దశలో సుమ అందర్నీ సుతిమెత్తగా హెచ్చరించారు. తరువాత పోలీసులు పడుతున్న కష్టానికి వారికి ధన్యవాదాలు తెలపాలి అంటూ ఫ్యాన్స్ ని కోరి తన సమయస్ఫూర్తిని చాటుకున్నారు.

ఇక నటుడు మురళీ శర్మ సాహో టీజర్ లో వినిపించిన డైలాగ్ మళ్ళీ వినిపించి అభిమానులను అలరించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories