సాహో ప్రి రిలీజ్ వేడుక: డార్లింగ్ విత్ డై హార్డ్ ఫ్యాన్స్

సాహో ప్రి రిలీజ్ వేడుక: డార్లింగ్ విత్ డై హార్డ్ ఫ్యాన్స్
x
Highlights

భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సాహో. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగాయి. వేలాదిమంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్న సాహో వేడుక కళ్ళుచేదిరేలా సాగింది.

భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సాహో. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగాయి. వేలాదిమంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్న సాహో వేడుక కళ్ళుచేదిరేలా సాగింది. సుమ వ్యాఖ్యాతగా.. పలు డాన్స్, పాటల కార్యక్రమాలతో సందడిగా కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో సాహో గురించి రాజమౌళి మాట్లాడారు.

ప్రభాస్ అందరివాడు..

అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని అభిమానిస్తారు. అలా ప్రభాస్ మొదట్నుంచీ తన శైలిని అలవర్చుకున్నాడు. ఎప్పుడూ తనకు సినిమా గురించిన ధ్యాసే. బాహుబలి చేస్తున్నప్పుడే.. సాహో కథ విన్నాడు. నాకు చెప్పాడు. చాలా ఉత్సాహంగా ఈ సినిమా చేస్తానన్నాడు. అంతే ఉత్సాహంగా సాహో చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్. ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదుగుతాడు. ఇక ఈ సినిమా దర్శకుడు సుజిత్.. సినిమాకి వెన్నెముకలా నిలబడ్డాడు. ఇంత పెద్ద సినిమాని సుజీత్ ఎలా చేస్తాడో అని అందరూ అనుమాన పడ్డారు. కానీ ఫస్ట్ లుక్ చూశాకా అర్థం అయింది సుజీత్ సత్తా ఏమిటనేది. చాలా బాగా చేశాడు అని రాజమౌళి సాహో గురించి చెప్పారు.

ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ కావాలి!

రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాని ఎంతో ఇష్టపడి, కష్టపడి చేశాడు. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో యాక్షన్ సీన్లు చేశారు. గ్రాఫిక్స్ లేకుండా చేసిన ఆ సీన్ల కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ కావాలి అంటూ ఆకాంక్షించారు.

ఇక రెండు సినిమాలిస్తా..

ఈ సినిమా తరువాత సంవత్సరానికి రెండు సినిమాలు కచ్చితంగా చేస్తానని ప్రభాస్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు. ఇంతకు ముందు చెప్పి చేయలేకపోయాను. ఇప్పుడు మీకు చెప్పకుండానే ఫిక్స్ అయ్యాను అన్నారు. సుజీత్ ఈ సినిమా కథను చెప్పడానికి వచ్చినప్పుడు నిక్కరుతో వచ్చాడు. 22 ఏళ్ల వయసులో రన్ రాజా రన్ సినిమా చేశాడు. ఆ ఆసమయంలోనే నిర్మాతలు సుజిత్ నాకు కథ చెప్పాడు. 40 ఏళ్ల వాడిలా కథ చెప్పిన సుజిత్ సినిమా షూటింగ్ కూడా అంతే అద్భుతంగా చేశాడు అని చెప్పారు ప్రభాస్. ''డై హార్డ్‌ ఫ్యాన్స్‌ అని ఇందులో సంభాషణలు రాసింది సుజీతే. తనకి మాస్‌ పల్స్‌ తెలుసు అందుకే సినిమాని ఈ రేంజ్ లో చేయగలిగాడు అన్నారు. షూటింగ్ మొదలైనప్పుడు అందరూ పెద్ద సాంకేతిక నిపుణులే. వాళ్లని సుజీత్ ఎలా హ్యాండిల్‌ చేస్తాడా అని కంగారుపడ్డాం. సుజీత్‌ ఒక్క రోజు కూడా కోపం లేకుండా హ్యాండిల్‌ చేసిన విధానాన్ని చూసి గొప్ప దర్శకుడు అయిపోతాడనిపించింది. బహుశా అంతర్జాతీయ దర్శకుడు అయిపోతాడేమో. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేసింది శ్రద్ధా. ఒక నటి రెండేళ్లపాటు పనిచేయడమంటే ఆషామాషీ కాదు. తను నటించడం మా అదృష్టం. చాలా బాగా నటించింది, యాక్షన్‌ కూడా బాగా చేసింది. నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ నా స్నేహితులు. ఈ సినిమాని జాగ్రత్తగా చేసుంటే... రూ.100 కోట్లు లాభం వచ్చేది. అంత లాభం వదులుకొని ఈ సినిమాని ఇంత భారీగా తీశారు. మనందరికీ అలాంటి స్నేహితులు ఉండాలి'' అన్నారు.

మొత్తమ్మీద సాహో సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇప్పటివరకూ ఇండియా సినిమాలో ఏ సినిమాకి జరగనంత భారీగా జరిగింది. ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూదడటం మామూలే కానీ, ఈ వేడుక చూశాకా సినిమా అభిమానులందరూ సాహో విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 30న సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories