సెన్సార్ దాటిన సాహో

సెన్సార్ దాటిన సాహో
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈనెల 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈనెల 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దాదాపు మూడుగంటల (కచ్చితంగా చెప్పాలంటే 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు) నిడివి వున్న సాహో సినిమాలో హాలీవుడ్ తరహా యాక్షన్ సన్నివేశాలు అలరించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ల పై ఈ సినిమా ప్రదర్శితం కానుంది. హీరో ప్రభాస్ ఇతర చిత్ర బృందం దేశంమంతా సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతున్నారు. ప్రచారంలో కూడా సాహో వేగంగా దూసుకుపోతోంది. సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా, ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories