రామ్ తో చేయి కలపనున్న 'అప్పట్లో ఒకడుండేవాడు' దర్శకుడు

రామ్ తో చేయి కలపనున్న అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు
x
Highlights

'హలో గురు ప్రేమకోసమే' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక...

'హలో గురు ప్రేమకోసమే' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు రామ్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ రామ్ అప్పుడే తన తదుపరి ప్రాజెక్టు సైన్ చేసాడని తెలుస్తోంది.

'అప్పట్లో ఒకడుండేవాడు' అనే సినిమాతో హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ మధ్యనే రామ్ కు ఒక కథ చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. రామ్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ స్రవంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విడుదలైన తర్వాత జూన్లో సాగర్ చంద్ర తో సినిమా పట్టాలెక్కనుంది. సాగర్ చంద్ర ఇంతకుముందు వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories