saaho twitter review: ఇది ప్రపంచస్థాయి సినిమా

హాలీవుడ్ సినిమా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన ప్రభాస్ సాహో మొదటి రిపోర్ట్ వచ్చేసింది. ఇతరదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో సినిమా పై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

K V D Varma
Updated on: 30 Aug 2019 11:50 AM IST
saaho twitter review: ఇది ప్రపంచస్థాయి సినిమా
X

హాలీవుడ్ సినిమా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన ప్రభాస్ సాహో మొదటి రిపోర్ట్ వచ్చేసింది. ఇతరదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో సినిమా పై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇప్పటివరకూ ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. సాహో ప్రపంచస్థాయి సినిమా..సాహో హాలీవుడ్ రేంజ్ లో వుందంటున్నారు. మొదటి భాగంలో ప్రభాస్ ఇంట్రడక్షన్..ఇన్టర్వెల్ ట్విస్ట్ అదరగొట్టాయట. ప్రథమార్థం అంతా కాస్త పాత్రల పరిచయాలు వంటి అంశాలతో సాగినా, రెండోభాగం మాత్రం ఫుల్ యాక్షన్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేసిందని అంటున్నారు.

ప్రభాస్ షో.. స్క్రీన్ ప్లే సూపర్ అయితే..దానికి ప్రభాస్ నటనతో మరింత అందంగా సినిమా వచ్చిందని అంతా అభిప్రాయపడ్డారు. ఇది బాహుబలి విజృంభణ అని పొగిడేస్తున్నారు. అయితే..హీరయిన్ శ్రద్ధా కపూర్ కొంత నిరాశపర్చిందని చెబుతున్నారు మొత్తం మీద సాహో ప్రచారంలో చెప్పినట్టే.. అదరగొట్టిందంటున్నారు. మరి కొద్దిసేపటిలో మన రివ్యూ కూడా వచ్చేస్తుంది.





K V D Varma

K V D Varma

Next Story