Akhanda Movie Song: "అఖండ" గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన థమన్

* అఖండ ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలో మీ ముందుకు వస్తుంది * "అఖండ" బీజిఎం ఫైర్ వర్క్స్ రేపటి నుండి మొదలు కాబోతున్నాయి

admin1
Updated on: 8 Oct 2021 6:04 PM IST
S Thaman Tweets that Akhanda Movie Single will Release Tomorrow 16th September 2021
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా "అఖండ" (ఫోటో- ది హన్స్ ఇండియా)

Akhanda Movie Song: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "అఖండ". బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎస్.ఎస్.తమన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

"అఖండ" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పాట గురించి ఒక వార్త రేపు విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. "అఖండ" పోస్టర్ను షేర్ చేస్తూ "అఖండ" బీజిఎం ఫైర్ వర్క్స్ రేపటి నుండి మొదలు కాబోతున్నాయి. అఖండ ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలో మీ ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ గారు మరియు బోయపాటి గారి కాంబో మరొకసారి షైన్ అవ్వనుంది అని ట్వీట్ చేశారు. ఇక అఖండ ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story