నాని కోసం విలన్ గా మారనున్న హీరో

నాని కోసం విలన్ గా మారనున్న హీరో
x
Highlights

యంగ్ హీరో కార్తికేయ 'ఆర్ఎక్స్ 100' సినిమాతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బోల్డ్ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో కార్తికేయ...

యంగ్ హీరో కార్తికేయ 'ఆర్ఎక్స్ 100' సినిమాతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బోల్డ్ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో కార్తికేయ పాత్ర కు నెగిటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కార్తికేయ 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే 'ఆర్ఎక్స్ 100' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించిన కార్తికేయ ఈసారి ఫుల్ లెంత్ విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'జెర్సీ' సినిమాతో బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని ఈ సినిమా పూర్తవగానే 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కార్తికేయ ను సంప్రదించారట. ఈ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకుంటాడా లేక విలన్ పాత్ర అని అభ్యంతరాలు చెబుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా హీరో పాత్రలతో మెప్పించిన కార్తికేయ ఇప్పుడు విలన్ పాత్రలో ఎలా నటిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ సినిమా పక్కన పెడితే కార్తికేయ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తో బిజీగా ఉన్నాడు ఈ యువ హీరో.

Show Full Article
Print Article
Next Story
More Stories