RRR Movie Update : ఫ్యాన్స్ గెట్ రెడీ.. రేపే అప్డేట్!

RRR Movie Update : ఫ్యాన్స్ గెట్ రెడీ.. రేపే అప్డేట్!
x

RRR movie 

Highlights

RRR Movie Update : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

RRR Movie Update : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.

అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు... ఆ మధ్య రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున ఎలాంటి సప్ రైజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు.. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.. 'మా పండుగ పోస్టులు ఇక చాలు. అప్‌డేట్స్ కోసం మమ్మల్ని రకరకాలుగా తిట్టారు. మీ ప్రేమతో మాపై బాంబుదాడి చేసినందుకు ధన్యవాదాలు. సమయం వచ్చింది. మిమ్మల్ని అలరించే బాధ్యత మాపై పడింది. రేపటి కోసం ఎదురుచూడండి' అని పోస్టు చేసింది. దీనితో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.



ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories