మరోసారి RRR వాయిదా?

మరోసారి RRR వాయిదా?
x

Rajamouli ss 

Highlights

RRR Movie Update : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..

RRR Movie Update : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.

చూస్తుంటే సినిమా మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ సినిమా తిరిగి షూటింగ్ ప్రారంభించడం పట్ల దర్శకుడు రాజమౌళి స్పందించాడు. " కరోనా వలన ఆగిపోయిన సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ విష‌యానికి వ‌స్తే సినిమాకి సంబంధించిన వి.ఎఫ్‌.ఎక్స్‌ చాలా వర్క్ మిగిలిపోయింది. వి.ఎఫ్‌.ఎక్స్‌ స్టూడియోస్ అన్ని మూసివేసి ఉండ‌డంతో పనులు ముందుకు సాగలేదు.. ఇక సినిమా షూటింగ్ ఎలా మొదలు పెట్టాలి అన్నదానిపైన కసరత్తులు మొదలవుతున్నాయి. అతి త్వరలోనే షూటింగ్ ని మొదలు పెట్టనున్నాం.. ప్రస్తుతం రెండు నెల‌లు షూటింగ్ చేయాల‌నుకుంటున్నాం" అని జక్కన్న వెల్లడించారు..

రాజమౌళి చెప్పినట్టుగా చూస్తే సినిమా నవంబర్ లో మొదలు పెడితే నవంబర్, డిసెంబర్ ఈ రెండు నెలలు షూటింగ్ లకే టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సినిమా ప్రమోషన్స్ వీటికి మరింత సమయం పడుతుంది.. సో ముందుగా అనుకున్న జనవరి 8కి సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జులై 30నే సినిమాని రిలీజ్ చేయాలనీ భావించాడు రాజమౌళి..

Show Full Article
Print Article
Next Story
More Stories