logo
సినిమా

రిలీజ్ కు ముందే రికార్డుల మోత

రిలీజ్ కు ముందే రికార్డుల మోత
X
Highlights

బాహుబలి సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు ఒక అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు ఒక అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను డి.వి.వి.దానయ్య మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మోత మొదలు పెట్టిందని తెలుస్తోంది.

ఈ సినిమాను అర్రి అలెక్స ఎల్ ఎఫ్ అండ్ అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేయనున్నారు. ఇంతకుముందు సెంథిల్కుమార్ అర్రి కెమెరాలను 'బాహుబలి'కి వాడారు. సెంథిల్ పనితనం మెచ్చిన ఆ కంపెనీ వారు ఇప్పుడు వారి లేటెస్ట్ టెక్నాలజీ ని సెంథిల్ తోనే వాడిద్దామని అనుకుంటున్నారు. అర్రి కంపెనీ తీసుకొచ్చిన కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ని 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు వాడుతున్నారు. ఇక విడుదలకు ముందే రికార్డుల ఖాతా తెరిచిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

Next Story