RRR: తెలుగులో కంటే "ఆర్ ఆర్ ఆర్" హిందీ వెర్షన్ ఐదు నిమిషాలు ఎక్కువ?

RRR Movie Runtime Higher in Bollywood Than Tollywood | Live News
x

RRR: తెలుగులో కంటే "ఆర్ ఆర్ ఆర్" హిందీ వెర్షన్ ఐదు నిమిషాలు ఎక్కువ?

Highlights

RRR: "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే...

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైలర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనే కాక మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే తాజాగా సినిమా రన్ టైం కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ 3 గంటల రెండు నిమిషాలు అనే సంగతి ఇప్పటికే తెలిసిందే. అంటే హిందీ వెర్షన్ మాత్రం తెలుగు వర్షన్ కంటే ఐదు నిమిషాలు ఎక్కువగా ఉందట. అంటే మూడు గంటల 7 నిమిషాల అని తెలుస్తోంది.

తెలుగులో లేకుండా మరి హిందీలో ఆ ఎక్స్ట్రా ఐదు నిమిషాలు ఏ ఏ సన్నివేశాలు ఉన్నాయని అభిమానులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలయ్యే దాకా దీని గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. ఇక మరోవైపు అవసరమైతే హిందీ వర్షన్ కోసం మరికొన్ని ఎడిషనల్ సన్నివేశాలని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories