ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి

ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'ఆర్ ఆర్ ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్...

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'ఆర్ ఆర్ ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ తో బిజీగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఒక హీరో కి బ్రేకిచ్చి మరొక హీరోపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

మొదటినుంచి తారక్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి షూటింగ్ కి హాజరైనప్పటికీ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చి రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇందులో పదుల సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫైట్ సీన్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ లోని ఒక ప్రత్యేకమైన పోలీస్ చెక్ పోస్ట్ సెట్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల గురించి బోలెడు పేర్లు బయటకు వస్తున్నాయి కానీ చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories