'ఆర్ ఆర్ ఆర్' లో దొంగ-పోలీస్ ఆట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ గతేడాది డిసెంబర్లో పూర్తయింది.

Ruthvik
Published on: 22 Jan 2019 3:56 PM IST
ఆర్ ఆర్ ఆర్ లో దొంగ-పోలీస్ ఆట
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ గతేడాది డిసెంబర్లో పూర్తయింది. ఈ మధ్యనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాత్రలపై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక దొంగ కనిపించనున్నాడట. అంతేకాక రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య సీన్లు సినిమాలో హైలైట్గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇంతకు మునుపు ఎన్టీఆర్ 'యమదొంగ' సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో నే దొంగ పాత్రలో కనిపించాడు. ఇక చెర్రీ కూడా 'తూఫాన్' లో పోలీస్ గా దర్శనమిచ్చాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story