సాహో కంటే తక్కువగా ఉన్న "అర్ఆర్ఆర్" కలెక్షన్లు

సాహో కంటే తక్కువగా ఉన్న "అర్ఆర్ఆర్" కలెక్షన్లు
*సాహో కంటే తక్కువగా ఉన్న "అర్ఆర్ఆర్" కలెక్షన్లు
RRR-Saaho: బాహుబలి సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాగా మరియు స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమాగా "అర్ఆర్ఆర్" చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పటి నుంచో సినిమాను థియేటర్లలో చూడాలని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ కు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇంకా చెప్పాలంటే "అర్ఆర్ఆర్" సినిమా కలెక్షన్లు ప్రభాస్ నటించిన సాహో సినిమా కంటే తక్కువగానే ఉన్నాయి.హిందీలో మొదటిరోజున సాహో సినిమా 24 కోట్లు వసూలు చేయగా "అర్ఆర్ఆర్" సినిమా కేవలం 19 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో కూడా "అర్ఆర్ఆర్" హవా తక్కువగా ఉందని చెప్పాలి.
ముంబైలో సాహో సినిమా 7.3 కోట్లు చేయగా "అర్ఆర్ఆర్" 6.5 కోట్లు వసూలు చేసింది. ఢిల్లీలో సాహో కలెక్షన్లు 6.1 కోట్లు కాగా "అర్ఆర్ఆర్" కేవలం 3.85 కోట్లు మాత్రమే గడిచింది.పంజాబ్ లో కూడా సాహో సినిమా కి మొదటిరోజున రెండున్నర కోట్లు రాగా "అర్ఆర్ఆర్" 1.75 కోట్ల తో సరిపెట్టుకుంది. నిజానికి పుష్ప సినిమా హిందీ వెర్షన్ కి కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అయితే హిందీలో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లకు లేదని అందరికీ తెలిసిందే. అందుకే కలెక్షన్లు అంతంత మాత్రంగా వచ్చాయని చెప్పవచ్చు.
ఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMTఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం
19 Aug 2022 7:44 AM GMTబాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMT
మునుగోడు గెలుపు ప్రజలే నిర్ణయిస్తారన్న మంత్రి తలసాని
20 Aug 2022 6:24 AM GMTయూపీ బన్కే బీహారీ ఆలయంలో విషాదం
20 Aug 2022 6:00 AM GMTప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు
20 Aug 2022 5:42 AM GMTVijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMT