సినిమాల్లో రోజా.. జబర్దస్త్ కి టాటా?

సినిమాల్లో రోజా.. జబర్దస్త్ కి టాటా?
x
Highlights

ఎమ్మెల్యే రోజా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నరన్న వార్త ఇటీవల వైరల్ అయింది. ప్రముఖ హీరో సినిమాలో ఆమెకు మంచి పాత్ర వచ్చిందనీ, ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారనీ టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. రోజాకి ఓ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలో అవకాశం వచ్చింది అనేది ఆ వార్త. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి కేబినేట్ హోదా లో పదవి సంపాదించుకున్న రోజా.. జబర్దస్త్ షో మాత్రం మానలేదు. నిజానికి జబర్దస్త్ షో రోజా, నాగబాబు లేకుండా చూసే పరిస్థితి లో ప్రేక్షకులు లేరు. అంతలా వారు జబర్దస్త్ లో ఇమిడిపోయారు. మరోవైపు షో నిర్మాతలు కూడా రోజా, నాగబాబును పక్కన పెట్టే పరిస్థితిలో లేరన్న విషయం స్పష్టం. ఇదిలా ఉంటే, తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. రోజా టాలీవుడ్ టాప్ హీరో నటిస్తున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్రతో వెండితెర మీద రీ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఆమె, ఇటు ప్రభుత్వ పదవీ, అటు జబర్దస్త్, సినిమా మూడిటినీ సమన్వయం చేసుకునే సమయం సరిపోదని భావిస్తున్నరానీ, అందుకే జబర్దస్త్ కి సెలవు పెట్టాలనుకుంటున్నారనీ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈవార్తలు విన్న అభిమానులు రోజా లేకుండా జబర్దస్త్ చూడలేమని తెగ బాధ పడిపోతున్నారు. ఈ వార్తలో నిజానిజాలు అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు మాత్రం రోజా సినిమాల్లో రీ ఎంట్రీ అన్న వార్తను నమ్ముతున్నారని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories