Sushant Singh's Father : రియా చక్రవర్తి నా కుమారుడికి విషం ఇచ్చి చంపింది : సుశాంత్ తండ్రి

Sushant Singh's Father : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది.. ఇప్పటికే సీబీఐ సుశాంత్ స్నేహితుడు

Krishna
Published on: 27 Aug 2020 2:10 PM IST
Sushant Singhs Father : రియా చక్రవర్తి నా కుమారుడికి విషం ఇచ్చి చంపింది : సుశాంత్ తండ్రి
X

sushant singh rajput

Sushant Singh's Father : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది.. ఇప్పటికే సీబీఐ సుశాంత్ స్నేహితుడు, సుశాంత్ పనిమనిషిలను విచారణ చేపట్టి పలు విషయాలను రాబట్టింది. తాజాగా ఈ కేసులో మాదకద్రవ్యాల కోణం బయటపడింది. దీనితో సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్పందిచారు.. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన అయన రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని అంటూ కామెంట్స్ చేశారు.. చాలా రోజులుగా రియా చక్రవర్తి నా బిడ్డకు విషం ఇచ్చిందని, ఆమె ఒక హంతకురాలని, ఆమెను, ఆమె అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి' ఆయన డిమాండ్ చేశారు. అటు సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ వరస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే..



జులై నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. కానీ ఇది ఆత్మహత్య కాదని హత్యేనని పలువురు భావిస్తున్నారు.

సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని జూలై నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేశారు.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.

Krishna

Krishna

Next Story