తనతో కలిసి డ్రింక్ తాగడానికి అందర్ని ఆహ్వనించిన ఆర్జీవీ

రాంగోపాల్ వర్మ..సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు

admin1
Updated on: 29 Dec 2019 10:50 PM IST
తనతో కలిసి డ్రింక్ తాగడానికి అందర్ని ఆహ్వనించిన ఆర్జీవీ
X
RGV

రాంగోపాల్ వర్మ..సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. పబ్లిసీటీ విషయంలో ఆర్జీవీకో పంథా ఉంది...ఇటీవల బ్యూటిఫుల్ టీం ఫ్రీ న్యూ ఇయర్ పార్టీలో స్టెప్పులు వేసి అదరగొట్టిన ఆర్జీవీ... డిసెంబర్ 31న ప్రీ- న్యూఇయర్ పార్టీ సందర్భంగా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనతో కలిసి డ్రింక్ తాగడానికి అందర్ని ఆహ్వానించారు. ఫేస్ బుక్.. ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ లో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారిగా ప్రైవేట్ పార్టీని పబ్లిక్ చూపించారు. ఇలాంటి ఐడియా రావడం RGV కే సాధ్యం అయ్యింది.

ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాతో సందడి చేసిన వర్మ తాజాగా బ్యూటిఫుల్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు . ఈ సినిమాలో నయనా గంగూలీ మెయిన్ లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమాని జనవరి 1న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.

admin1

admin1

Next Story