RGV Tweet On Kangana Ranaut : మహారాష్ట్ర తదుపరి సీఎం కంగనా : అర్జీవీ

RGV Tweet On Kangana Ranaut : మహారాష్ట్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, శివసేనల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా

Krishna
Updated on: 9 Sept 2020 6:22 PM IST
RGV Tweet On Kangana Ranaut : మహారాష్ట్ర తదుపరి సీఎం కంగనా : అర్జీవీ
X

Kangana Ranut, Ram Gopal Varma

RGV Tweet On Kangana Ranaut : మహారాష్ట్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, శివసేనల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆ వార్ మరింతగా ముదిరింది.. ముంబైలో ఈ రోజు కంగనా ఆఫీస్ ని బీఎంసీ అధికారులు కూల్చివేయడంతో వరుస ట్వీట్లతో కంగనా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కంగనాకి మద్దతు పలుకుతూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.

"చూస్తుంటే కంగనా భవిష్యత్తులో సీఎం అయ్యేలా ఉందని, అప్పుడు బాలీవుడ్ ప్రముఖులంతా తట్టబుట్టా సర్దుకోవాల్సిందేనని ట్వీట్ చేశాడు..అంతేకాకుండా కంగనా సీఎం అయినప్పుడు ఆర్నబ్ గోస్వామి పీఎం అవుతాడు. శివసేన కనుమరుగు అయిపోతుంది. ముంబై పోలీసుల స్థానంలో రిపబ్లిక్ టీవీ ఉంటుంది.. కాంగ్రెస్ ఇటలీ పారిపోతుంది"అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు వర్మ.. "కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్‌ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్‌ లేదు" అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ..


అటు కంగనా ట్విట‌ర్ లో వీడియోని పోస్ట్ చేస్తూ.. "బాలీవుడ్ మాఫియాను ఎం చేయలేక నా ఆఫీస్ ని కూల్చే ప్రయత్నం చేసి ఎదో సాధించారని అనుకుంటున్నారు..ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? గుర్తుపెట్టుకోండి ఉద్దేవ్ థాక్రే రేపు మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ ఆ వీడియోలో వెల్లడించింది కంగనా..



Krishna

Krishna

Next Story