RGV Respond On His Health : దర్శకుడు వర్మకు కరోనా.. వర్మ ఏమన్నాడంటే?

RGV Respond On His Health : లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెట్టేసి ఖాలీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్

Krishna
Published on: 10 Aug 2020 2:37 PM IST
RGV Respond On His Health :  దర్శకుడు వర్మకు కరోనా.. వర్మ ఏమన్నాడంటే?
X
RGV Respond On His Health

RGV Respond On His Health : లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెట్టేసి ఖాలీగా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో రిలీజ్ చేస్తున్నాడు వర్మ.. తాజాగా 'డేంజరస్' అనే మరో సినిమాను ప్రకటించాడు. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టుగా వర్మ వెల్లడించాడు..

ఇక ఇది ఇలా ఉంటే వర్మకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి అదేంటంటే వర్మకి కరోనా సోకిందని..అవును గత కొద్ది రోజులుగా వర్మ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపైన వర్మ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు..

నాకు తీవ్ర జ్వరం వ‌చ్చింద‌ని, నేను కరోనాతో బాధపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. వ‌రుస సినిమాలు చేస్తున్నాను కూడా . సీరియ‌స్‌గా వ‌ర్కవుట్స్ కూడా చేస్తున్నా. ఫ్రెండ్స్ మిమ్మల్ని నిరాశ‌ప‌రుస్తున్నందుకు క్షమించండి..ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని, భవిష్యత్తులో వాళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను అని వర్మ పేర్కొన్నాడు. దీనితో వర్మకి కరోనా అనే వార్తలకి పులిస్టాప్ పెట్టినట్టు అయింది.



Krishna

Krishna

Next Story