RGV: రాజమౌళి హత్యకు కుట్ర.. ఆర్జీవీ సంచలన పోస్ట్...

Rajamouli Murder Plan: ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉంది.

Arun Chilukuri
Published on: 24 Jan 2023 12:30 PM IST
RGV Asks SS Rajamouli to Beef up Security
X

RGV: రాజమౌళి హత్యకు కుట్ర.. ఆర్జీవీ సంచలన పోస్ట్...

Rajamouli Murder Plan: ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉంది. జేమ్స్ కెమరూన్ వంటి వాడే.. రాజమౌళి తీసిన సినిమా గురించి, అందులోని సీన్స్ గురించి అంత గొప్పగా వివరిస్తూ వస్తే.. ఎవ్వరికైనా సరే ఈర్ష్య పుడుతుంది. అయితే రాజమౌళిపై ప్రపంచ స్థాయి సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. భారతీయ దర్శకులు మాత్రం ఈర్ష్యతో రగిలిపోతున్నారట. అంతేకాదు అతన్ని హత్య చేసేందుకు కుట్ర కూడా చేస్తున్నారట. ఈ విషయాన్ని వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్న ఆర్జీవీ.. ఆ వెంటనే మరో ట్వీట్‌ చేస్తూ రాజమౌళికి సెక్యూరిటీ పెంచుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. దేశంలోని కొందరు దర్శకులు అసూయతో రగిలిపోతూ.. రాజమౌళిని చంపడానికి రెడీ అవుతున్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు ఆర్జీవీ. అంతేకాదు అందులో తానూ ఒకడినని ఆయన చెప్పడం గమనార్హం. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయట పెట్టేస్తున్నానంటూ సరదాగా ట్వీట్ చేశారు వర్మ. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story