Renuka Shahane Shocked with Current Bill: కరెంటు బిల్లు చూసి షాక్ అయిన మరో నటి!

Renuka Shahane Shocked with Current Bill: కరెంటు బిల్లు చూసి షాక్ అయిన మరో నటి!
x
Highlights

Renuka Shahane Shocked with Current Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి.

Renuka Shahane Shocked with Current Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. ఈ సమస్య కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఎదురుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సమస్యను యంగ్ హీరోయిన్స్ అయిన కార్తీక, తాప్సీకి ఎదురుకాగా తాజాగా టాలీవుడ్ విలన్ అశుతోష్‌రాణా భార్య, నటి రేణుకా సహానేకి కూడా ఎదురైంది..

ఆమె ఉంటున్న నివాసానికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. అయితే కరోనా వలన గత మూడు నెలలుగా బిల్లు తీయ్యలేదు.. కానీ ఆ మూడు నెలల బిల్లును కలిపి ఒకేసారి పంపించారు ఎలక్ట్రిసిటీ అధికారులు.. ఇందులో మే 9వ తేదీన రూ. 5510 బిల్ రాగా ఇక జూన్‌లో మరో బిల్ రూ. 29700 వచ్చింది. అంటే మే మరియు జూన్‌లో వచ్చిన బిల్స్‌ని పరిశీలిస్తే.. ఒక్క మే నెలకే నాకు రూ. 18080 బిల్ వేశారు. అంతకుముందు నెల రూ. 5510 వచ్చిన బిల్, ఒక్క నెలకే రూ. 18080 ఎలా అయ్యింది? అంటూ ముంబై అదానీ ఎలక్ట్రిసిటీని ట్యాగ్ చేస్తూ మండిపడ్డారు ఆమె.. చాలా మంది నటులు అదానీ ఎలక్ట్రిసిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఎల‌క్ట్రిసిటీ అధికారులు..

ఇక తెలుగు సినిమా ల్లో విలన్ గా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు అశుతోష్ రాణా.. వెంకీ పటాస్ , బంగారం , బలుపు, తడాఖా మొదలగు సినిమాల్లో ఆయన విలన్ గా నటించారు..ఇక ఆయన నటి రేణుకా సహానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories